నిప్పచ్చరము
ఆగష్టు 24, 2021
నిప్పచ్చరము (nippaccharamu)
అర్థము
(విశేష్యము): పేదరికము; దారిద్ర్యము; లేమి; శూన్యము
Meaning
(noun) : poverty; destitute
వాడుక / Usage
ఐశ్వర్యములో మరియు నిప్పచ్చరములో అతని దాన గుణము భేదము లేకుండెను.
His helping nature was the same in wealth and poverty.
మెదడుకు మేత / Food for thought
ఎందుకయా సాంబశివ……
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
చరణం :
అలల తోటి గంగ పట్టి తలపాగా చుట్టి...2
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ…….నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగా పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
తోలు కట్టి పటకాగా కాలాగ్ని కుట్టి...2
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ…….
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర...2
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ…..
ఎందుకయా ఈ దాసుని కందవయా దయామయా
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా…..2
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పెరయా
నీ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబశివ సాంబశివ సాంబశివ
సాంబశివ సాంబశివ ...సాంబశివ సాంబశివ-- శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)
Comments
Post a Comment