నిరామయము

 

ఆగష్టు 25, 2021

నిరామయము (nir-āmayamu)

    అర్థము

   (విశేషణము): సౌఖ్యము; రోగము లేనిది; ఆమయము = రోగము

   Meaning

   (adjective) : health; free from disease

     వాడుక / Usage
  నిరామయమైన జీవితం కొరకు ప్రకృతి సాన్నిధ్యం అవసరం.
  Being close to nature is essential for a healthy life.

    మెదడుకు మేత / Food for thought

"అదీ నాయనా కథ" అంటూ పూర్తి చేసాడు గురువు. 
శిష్యుడు సంతృప్తి చెందనట్టు చూసి "అదేమిటి స్వామీ అప్పుడే కథ అయిపోయిందా?"
"ఇంకా ఏం చెప్పాలి నాయనా?"
"లక్ష్మీ - గాంధీ పెళ్లి చేసుకున్నారో లేదో చెప్పనే లేదు."
గురువు భారంగా "నాయనా, నీకు వ్యవస్థ గురించి చెప్పాను. స్టాక్ ఎక్స్చేంజి గురించి చెప్పాను, డబ్బు లావాదేవీల గురించి చెప్పాను, రాజకీయాల గురించి చెప్పాను. వాటిని గురించి వదిలేసి ఇదేమి ప్రశ్న చివరికి...."
"లేదు స్వామీ! ఈ ఒక్కటీ చెప్పండి. మీ సొమ్మేం పోయింది" అని అరిచాడు.
గురువు పిడికిలి బిగించి శిష్యుడి మొహం మీద కొట్టాడు.

-- డబ్బు టుది పవరాఫ్ డబ్బు (ఉపసంహారం), యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి