ఆగష్టు 30, 2021
నవనీతము (navanītamu)
అర్థము
(విశేష్యము): అప్పుడే చిలికితీసిన వెన్న; నవ=కొత్త; నీతము=ధనము లేక నెయ్య
Meaning
(noun) : fresh butter
వాడుక / Usage
నటనలో గడుసుదనం. మనసంతా నవనీతం - సూర్యకాంతం.
Sharp tongue on screen but a gentle and helpful at heart - Suryakantham.
మెదడుకు మేత / Food for thought
వేవేల గొపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ' అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నలు దోచాడే
హా... హహహా' వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే, మిన్ను కన్న వన్నెకాడే...
మన్ను తిన్న చిన్నవాడే, మిన్ను కన్న వన్నెకాడే
కన్నతోడు లేనివాడే కన్నెతోడు ఉన్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే
(ఆ...') మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే
ఆ...' చీరలన్ని దోచి దేహచింతలన్ని తీర్చినాడే
పోతన్న కవితలన్ని పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
హా... హహహా' వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే, వేల తీరులున్నవాడే...
వేయి పేరులున్నవాడే, వేల తీరులున్నవాడే...
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
(ఆ...') గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
ఆ...' నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
హా... అహహా' వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ' అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నలు దోచాడే
అహ' అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నలు దోచాడే
హా... అహహా' వేవేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే
-- సాగర సంగమం, వేటూరి సుందర రామ మూర్తి (జనవరి 29, 1936 - 2010)
Comments
Post a Comment