కాణాచి
ఆగష్టు 26, 2021
కాణాచి (kāṇāchi)
అర్థము
(విశేష్యము): చిరకాల వసతి స్థానం; సుదీర్ఘ అనుభవం కలది; నెలవు; స్థావరము
Meaning
(noun) : hereditary possession; domicile; (used figuratively as well)
వాడుక / Usage
మన దేశంలో విదేశీ భాషల కాణాచి భాగ్యనగరంలోని ఇఫ్లూ.
The English and Foreign Languages University in Hyderabad is the foremost for foreign languages.
మెదడుకు మేత / Food for thought
ఆ కంచె 1869 లో భారతదేశపు మధ్యలో పొడవునా నిర్మించారు. అది సుమారు 3,701 కిమీ ఉండేది - అంటే లండన్ నుంచి ఇస్తాంబుల్ అంత దూరం అన్నమాట. దీనిని భారత దేశ మహా కంచె అని అంటారు. ఇది ఉప్పు సుంకం కోసం కట్టారు. పన్నెండు వేల బ్రిటీష్ సైనికాధికారులు దాదాపు ఏడాదికి రెండు కోట్ల వ్యయంతో దీనికి కాపలా కాసేవారు. (అంటే ఉప్పు సుంకం మీద బ్రిటిష్ వారు ఎంత గడించారో ఊహించండి) చొరబడటానికి వీలు లేనట్టి దట్టమైన పొదలతో దీనిని నిర్మించారు.అరేబియన్ సముద్ర తీర ప్రాంతాలనుండి బ్రిటీష్ పరిపాలనలో ఉన్న తూర్పు రాష్ట్రాలకి వచ్చే ఉప్పు మీద అత్యధికమైన అమానుషమైన శిస్తు విధించేవారు. దానివల్ల కరువు కాటకాలలో మృతుల సంఖ్య పెరిగింది అనేందుకు దాఖలాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి ఉప్పు ఎంత అవసరమో మనం గ్రహించం. అయినా చరిత్రలో ఇంతటి బాధాకర ఘట్టం, ప్రజలు అనుభవించిన దారుణమైన కష్టాలు చరిత్ర పుటలలో మరుగున పడిపోవడం ఖేదనీయం.
-- బ్రిటీష్ చరిత్రకారుడు, 'ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా' రచయిత, రాయ్ మొక్హం
Comments
Post a Comment