వాంఛ
సెప్టెంబర్ 14, 2021
వాంఛ (vancha)
అర్థము
(విశేష్యము): కోరిక; ఆకాంక్ష; సంకల్పము; ఇచ్ఛ
Meaning
(noun) : wish; desire
వాడుక / Usage
జిల్లా ప్రజల చిరకాల వాంఛ, బందరు నౌకాశ్రయం, ఎండ మావిగానే మిగిలిపోతోంది.
Long standing desire of the people, Bandar port, continues to be a mirage.
మెదడుకు మేత / Food for thought
"పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా...
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని...
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది....
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన...
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది"
--కోకిలమ్మ, ఆచార్య ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment