సుధాకరుడు
సెప్టెంబర్ 15, 2021
సుధాకరుడు (sudhā-karuḍu)
అర్థము
(విశేష్యము): చంద్రుడు; సుధ (అమృతం) వలే హాయి కలిగించు కిరణములు కలవాడు
Meaning
(noun) : moon
వాడుక / Usage
మబ్బు చాటునుంచి తొంగి చూసే సుధాకరుడు తన గుట్టు రట్టు చేస్తాడేమోనని కోపగించుకుంది.
She cursed the moon angry that it might spill her secret.
మెదడుకు మేత / Food for thought
"మిట్టమధ్యానం నడి నెత్తిన వచ్చాడు
ఓంటరిగా పోతుంటే ఎ౦టె౦ట పడ్డాడుఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితేఎరుపెక్కి ఉన్నాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితేఎరుపెక్కి ఉన్నాడు
ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట"
--జయసుధ, సినారె (జులై 29, 1931 - 2017)
Comments
Post a Comment