ప్రమోదము

 

సెప్టెంబర్ 16, 2021

ప్రమోదము (pra-mōdamu)

    అర్థము

   (విశేష్యము): సంతోషము; ఆనందము; హర్షము

   Meaning

   (noun) : happiness; joy

     
   వాడుక / Usage
ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము. ఏమిటది?
Happy to have in the house but dangerous to have in the body. What is it?

   మెదడుకు మేత / Food for thought

"అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....

  ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....

  మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....

  ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....

  భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్."

  వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......

   అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....

   ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..

   hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.

   ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...

   తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..

   గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....

   కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...

   ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....

   మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..

   కరెంటు రెంటు etc., మన కష్టాలు...

   కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు

   నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్."


-- అమృతం (2001 - 2007), సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ