పెన

 

సెప్టెంబర్ 17, 2021

పెన (pena)

    అర్థము

   (విశేష్యము): బంధనము; లంకె; మెలిక; రెండు పశువులును కలిపి ముడి వేసే త్రాడు

   Meaning

   (noun) : twist of ropes; a bond; rope tying two animals together

     
   వాడుక / Usage

రాజకీయం మరియు మతం విషపూరితంగా పెన వేసుకు పోయాయి.
Politics and religion have become poisonously intertwined.

   మెదడుకు మేత / Food for thought

ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి
తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం ఫలింప చేయవే
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ తారక సుధాకరా తపించసాగినే
హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత రాగమే సరాగమై ప్రమోదమాయెనే
హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర
ఆ హాహాహ హాహాహ
ఆ హాహాహ హాహాహ
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే ఊహలో ఒయ్యారమో
నా ఊహలో ఒయ్యారమో ఉయ్యాలలూగెనే
ప్రేయసి మనోహరి వరించి చేరవే

ప్రేయసి మనోహరి


-- వారసత్వం (1964), ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ