నిర్వచనము
సెప్టెంబర్ 20, 2021
నిర్వచనము (nir-vachanamu)
అర్థము
(విశేష్యము): అర్థము వివరించుట; ఒక విషయాన్ని దాని గుణములతో చెప్పడం; లోకోక్తి; మాటలేనిది
Meaning
(noun) : explanation; definition; proverb; (adj) silent
వాడుక / Usage
‘దేశభక్తి’ అనే మాటకు సరైన నిర్వచనం లేదు. గురజాడ ఆ మాటకు మానవతా దృక్పథం ఇచ్చారు.
Patriotism is not clearly defined. Gurajada gave it a people centered definition.
మెదడుకు మేత / Food for thought
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ !
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !
మతం వేరైతేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగీ
లోకమున రాణీంచునోయ్ !
దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనంపంటలు పండవలెనోయ్ !
ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్,
పలుకులను విని, దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్…
-- దేశభక్తి (1910), గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - 1915)
Comments
Post a Comment