నిరంజన

 

సెప్టెంబర్ 21, 2021

నిరంజన (nir-anjana)

    అర్థము

   (విశేష్యము): మచ్చ/దోషము లేనిది; అంజన(కాటుక) లేనిది; పున్నమి; శివుడు; మాలిన్యము లేనివాడు - పరబ్రహ్మ

   Meaning

   (noun) : blemish-less; full moon; free from passion; Brahman
     
   వాడుక / Usage

నిరంజనమైన పరిపాలన అతిశయోక్తిగా మిగిలి పోవలసిందేనా?
Is blemish free governance a hyperbole?

   మెదడుకు మేత / Food for thought


వెంక : మంత్రాలు చదివి దేవుఁణ్ణి ధ్యానం  చెయ్యాలిగాని, అన్నంకోసం ధ్యానంచేస్తే పాపంకాదా?

గిరీ :   ఇగ్నొరెన్స్‌! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్నిమతాలూ పరిశీలించి వాటితాలూకు యపెన్స్‌, నిగ్గుతీసి ఓ కొత్తమతం యేర్పర్చాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వలింపచేస్తాను. యిప్పడుమట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్‌? అన్నా`న్నా ధ్యానించడం, అని కదూ? యేవఁందోయి నీ ఉపనిషత్తు? "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌" అన్నవేఁ, బ్రహ్మ. అని తెలుసుకోవోయి, వెధవాయా, అంది. తెల్లవాడు యేవఁని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? "ఫాదర్‌, గివ్‌, అస్‌ అవర్‌, డెయిలీ బ్రెడ్‌" అనగా "నన్ను కన్నతండ్రీ, రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని"- ఇక, మనవేఁవఁనాలి? "తండ్రీ రోజూ, కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా" అని ధ్యానించాలి. మన చమకంలో యేమన్నాడూ? "శ్యామాకాశ్చమే" "చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుఁడా! అన్నాడు" ఆ చమకంలో యవడికి యిష్టవైఁన వస్తువులు వాడు కలపవచ్చును- "కందిగుండా చమే, యింగువ నూనా` చమే" దీనినే రిలిజియస్‌ రిఫార్ము అంటారు.

వెంక : గేదెపెరుగూ చమే, చేగోడీ చమే.

గిరీ : చబాష్‌! అదే ఒరిజినాలిటీ - అడిగితేగాని అమ్మ అయినా పెట్టదు. దేవుఁడు మాత్రం ముద్దిస్తాడనుకున్నావా యేమిటి? నీకు యెప్పుడు యేమి కావలిస్తే అప్పుడు ఆవస్తువులు సంపుటీచేసి చమకపారాయణ ఆరంభించేది.
వెంక : అయితే రేపణ్ణించి నేను రోజూ చమకపారాయణ చేస్తాను.

గిరీ : మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశావంటే, నీతండ్రి ఎడ్యుకేషన్‌ లేకపోవడంచేతా, రీజన్‌ తెలియకా, యిదేవిఁటి చమకం పాడు చేస్తున్నాడని పెణతెక్కగొట్టి, తొమ్మిదో అష్టం ఘనం పారాయణచేస్తాడు.


--కన్యాశుల్కం  (1897), గురజాడ అప్పారావు  (సెప్టెంబర్ 21, 1862 - 1915)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ