నివృత్తి
సెప్టెంబర్ 22, 2021
నివృత్తి (nivṛitti)
అర్థము
(విశేష్యము): ప్రవృత్తి (క్రియ) లేనిది; మోక్షము; సంతోషము; నివారణము;
Meaning
(noun) : renunciation; removal; abolition
వాడుక / Usage
మనిషి ఉన్నంతవరకు యుద్ధాల నివృత్తి సాధ్యమేనా?
As long as man exists is the abolition of war possible?
మెదడుకు మేత / Food for thought
తెలుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
-- తెలుగుబాల శతకం (1961), జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)
Comments
Post a Comment