నిశ్చలము
సెప్టెంబర్ 23, 2021
నిశ్చలము (niṣ-chalamu)
అర్థము
(విశేషణము): చలించనిది; స్థిరము; స్థిమితము; కదలక పోవడం
Meaning
(adj) : motionless; firm; resolute
వాడుక / Usage
నిశ్చలమైన పట్టుదలతో ఆమె సమస్యలన్నీ ఎదురుకుంది.
She faced all the obstacles with resolute firmness.
మెదడుకు మేత / Food for thought
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట
చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట
ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంట
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట
పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయెనట
అంతము వరకు కించిత్ ఆశతో పెంచెను జగమంతా
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట
చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట
-- తత్వాలు (రచయిత తెలియదు), అమరగాయకులు బాలమురళీకృష్ణ (జులై 6, 1930 - 2016)
Comments
Post a Comment