నిర్మలము

 

సెప్టెంబర్ 24, 2021

నిర్మలము (nir-malamu)

    అర్థము

   (విశేషణము): మలినము లేకపోవడం; శుద్ధము; శుభ్రము; (విశేష్యము): ధరించి తీసివేసిన పూలదండ; అభ్రకము

   Meaning

   (adj) : dirt free; pure; transparent; (noun): used garland; Mica
     
   వాడుక / Usage

నిర్మలమైన నిశ్చలమైన నీటిలోనే నీడ కనపడినట్లు ఆత్మ జ్ఞానానికి అదే విధమైన మనసు కావాలి.
Just as a reflection is only seen in unclouded and still water, a similar mind is needed for understanding the Self.

   మెదడుకు మేత / Food for thought

    అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము....
    సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము
    త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై
    ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
    మృతియె లేని సుధాలాప స్వర్గము  శంకరాభరణము
     ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము
    పాదాని  శంకరాభరణము
    శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము
    రాగ రత్న మాలికా తరళము  శంకరాభరణము

-- శంకరాభరణం, వేటూరి(జనవరి 29, 1936 - 2010), బాలు (జూన్ 4, 1946 - 2020)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ