ప్రకరణము
సెప్టెంబర్ 27, 2021
ప్రకరణము (prakaranamu)
అర్థము
(విశేష్యము): ప్రస్తావము; గ్రంథములో ఒక భాగము; నాటకాలలో ఒక పద్ధతి; రాజ్యాంగ నిబద్ధన
Meaning
(noun) : topic; subject; chapter of a book; type of drama; article in constitution
వాడుక / Usage
రాజ్యాంగంలోని 14,15,16,17 ప్రకరణలు సమానత్వపు హక్కును విశదీకరిస్తున్నాయి.
Articles 14,15,16,17 in the Constitution proclaim the Right to Equality.
మెదడుకు మేత / Food for thought
ఏడ భేఫికర్ గుండె ఖుల్లం ఖుల్లా గుంటదో.
ఏడ మోరెత్తుకుని బెదుర్లేక బతక లేస్తమో.
ఏడ తెల్వి ఏ ఒక్కని సోత్తయి పొదో.
ఏడనయితే జమానా జిందగీ మొత్తం బరాబర్ ఇరుకు గదుల్లెక్క ఇడగొట్టుకు పొదో.
యాడ్నతే గొంతునొచ్చే ప్రతిమాటా సచ్చం గుంటదో.
గలేమిల్నకి పుర్శత్ చేతులు పూరా సాపుకుని అలాయ్ బలయ్ అంటయో.
సచ్చమైన పంటకాల్వలెక్క కొట్టే అలగ్ సొంచాయిన్చుడు బుద్ధి,
పాసిపోయిన పాతలవాట్ల ఇసుకపర్ర లోంకి
ఇంకిపోకండుంటదో.
యాడైతే నా బుర్రా బుద్ధిని సచ్ సొంచాయిన్చుడు లోకి, నిజానం నెరువు తరీకా తొవ్వల్లోకి నువ్ నడ్పుతవో.
అసొంటి బాజాప్తా బతుకుల్లోకి
ఓరయ్యా! ఆడనే నా దేసానికి తెల్లారనియ్యి

-- రవీంద్రనాథ్ టాగోర్ (మే 7, 1861 - 1941), అనువాదం కట్టా శ్రీనివాస్ (antharlochana.wordpress.com)
Comments
Post a Comment