ప్రగల్భము

 

సెప్టెంబర్ 28, 2021

ప్రగల్భము (pra-galbhamu)

    అర్థము

   (విశేషణము): బడాయి; డాంబికం; గర్వపు మాటలు; ప్రౌఢమైన

   Meaning

   (adj) : boast; bold; spirited
     
   వాడుక / Usage

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది.
The government boasted about doubling farmers income.

   మెదడుకు మేత / Food for thought

యుధిష్ఠిర! మృత్యువు ప్రసన్నమైనప్పుడు మనిషి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు?
క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో
మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో
అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి
కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు

ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో
చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు చేరడా మహాప్రస్థానంలో
సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా
కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా

జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో
కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో
జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో
అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో

స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా
చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా
ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాతృగుణమే మన ఆప్త బంధువు కాదా!
-- యక్ష  ప్రశ్నలు,  'యుధిష్ఠిర & ద్రౌపది' పవన్ వర్మ ఆంగ్ల సొనెట్ కి  స్వేచ్ఛానువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ