ప్రజాతి

 

సెప్టెంబర్ 09, 2021

ప్రజాతి (prajathi)

    అర్థము

   (విశేష్యము): జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం - జాతుల సమూహం; పుట్టుట; ప్రసవం

   Meaning

   (noun) : genus; birth

     
   వాడుక / Usage
 మాగ్నోలియా అనేది పుష్ప సామ్రాజ్యం లో సుమారు 210 పుష్పించే మొక్క జాతుల ప్రజాతి.
 Magnolia is a genus comprising of 210 flowering species.

   మెదడుకు మేత / Food for thought

"ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది"

-- ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, డా. ఎల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - 1948)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ