అఘము

 

నవంబర్ 10, 2021

అఘము (aghamu)

    అర్థము

   (విశేష్యము):  పాపం; తప్పు; వ్యసనం; దోషం

   Meaning

   (noun) : sin; crime; mistake
     
   వాడుక / Usage

  చరవాణి నేటి తరానికి పెద్ద అఘము.
  Mobile phones are the biggest addiction of this generation.

   మెదడుకు మేత / Food for thought

  మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను
  పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను
  లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను
  తిరుమలగిరి హుండీలో చొరబడమంటాను
  కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను
  అలిగి ఉన్న పడుచు జంటతో కలబడమంటాను
  క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను
  పస చచ్చిన పేడి జాతిలో గుసబడమంటాను
  లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను
  తెగ ఒలికే కవి పలుకుల్లో దిగబడమంటాను
  అహంకారం ఎదురై వస్తే ఏమంటాను నేనేమంటాను
  నరుని వదిలి కొండా నెత్తిలో స్థిరపడమంటాను
  కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను
  దిగులెందుకు ఓయి సినారే తెగబడమంటాను

-- తెలుగు ఘజల్స్, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి