గ్లాని
నవంబర్ 11, 2021
గ్లాని (glāni)
అర్థము
(విశేష్యము): బడలిక; పని చేయడం వల్ల అలుపు; రోగము; చేటు; నష్టం; క్షిణించుట
Meaning
(noun) : fatigue; decay; decline
వాడుక / Usage
కండర గ్లానికి కారణం కండరాలకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడమే.
Muscle fatigue is caused by lack of adequate oxygen to muscles.
మెదడుకు మేత / Food for thought
కమ్ముకున్న ఈ ప్రగాఢమైన నిశ్శబ్దం వినబడుతోంది
కదులుతున్న కాలం దానిని అందరికీ పంచింది
కొంచం కొంచం బాధ అవును అదే మనందరి కథ
మబ్బు చాటున పొంచి ఉన్న వెలుగూ అదీ అందరి వాట
కనులలో ఎందుకు నీకా వ్యర్ధమైన భాష్పం
దొర్లే ప్రతి నిమిషం కాదా నీకు సరికొత్త ఋతు వరం
క్షణాలను ఎందుకీ కాలగర్భంలో కోల్పోతావు
హృదయమా అసలెందుకు నువ్వు ఏడుస్తావు
-- జావేద్ అక్తర్ (షాయరీ యొక్క స్వేఛ్చనువాదం)
Comments
Post a Comment