అమేయము

 

నవంబర్ 12, 2021

అమేయము (amēyamu)

    అర్థము

   (విశేషణము):  అధికము; మితము లేనిది; లెక్కకు మించినది; తెలుసుకోరానిది

   Meaning

   (adj) : immeasurable; boundless; vast
     
   వాడుక / Usage

 పద్మశ్రీ పురస్కార గ్రహీత తులసి గౌడకు  అరణ్యాల గురించి అమేయమైన విజ్ఞానం ఉంది. 
 Padma awardee Tulasi Gowda has a vast knowledge of the forests.

   మెదడుకు మేత / Food for thought

రమ్మంటె చాలు గాని రాజ్యాలు విడిచిరానా 
నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా
ఏడేడు సాగరాలు ఎన్నెన్ని పర్వతాలు
ఎంతెంత దూరమైన బ్రతుకంత నడిచిరానా
కనులందు మంచులాగ కలలన్ని కరగిపోగా
కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచి రానా
నీవున్న మేడ గదికి నను జేర నీయరేమో
జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా
పగబూని కరకు వారు బంధించి ఉంచినారు
ఏనాటికైన గానీ ఈ గోడ పొడిచి రానా

  -- తొలి తెలుగు గజల్ కవి దాశరథి (జులై 22, 1925 - 1987)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి