స్నిగ్ధము

 

నవంబర్ 15, 2021

స్నిగ్ధము (snigdhamu)

    అర్థము

   (విశేషణము):  స్నేహము ఉన్నది; చిక్కనైనది; నున్నగా ఉన్నది; నూనెగా ఉన్నది; మృదువైనది; 
   Meaning

   (adj) : friendly; thick; oily; smooth; soft; wet
     
   వాడుక / Usage

ఆమె వదనం స్నిగ్ధ కుసుమం, ఆమె వచనం స్నిగ్ధ సుకుమారం.
Her face is a soft blossom, her words gentle and amiable.

   మెదడుకు మేత / Food for thought

మన ప్రభుత్వాలు ఈరోజు చేసేవి మున్ముందు వచ్చే ప్రభుత్వాల నిబద్ధత, పనితీరు, నిర్ణయాల పైన ప్రభావం చూపుతాయి. ఇది మనం గుర్తు ఉంచుకోవడం అవసరం. ఈరోజు మనం వాడే అధికారాలు, చట్టాలు న్యాయమైన కావలసిన కారణాలకే కావచ్చు. కానీ మున్ముందు అవే చట్టాలు అన్యాయమైన అనుచితమైన కారణాలకు వాడవచ్చు.
అందుకనే సిద్ధాంతాలకు స్వేచ్ఛలకు విరుద్ధంగా చట్టాలను చేయడం రాబోయే ప్రమాదానికి హేతువు.

  -- తొలి ప్రధాని  పండిట్ జవహర్ లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి