నెత్తావి
నవంబర్ 23, 2021
నెత్తావి (net-tāvi)
అర్థము
(విశేష్యము): నెర=నిండైన + తావి=పరిమళము; సువాసన; సుగంధము; అత్తరు
Meaning
(noun) : odour; fragrance; perfume; sweet smell
వాడుక / Usage
"నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు"
The sweet smell of your companionship warms the cockles of my heart.
మెదడుకు మేత / Food for thought
శంకరమంచి అమరావతి కథలు పరమశివునికి అక్షరాభిషేకం, మహానివేదన ఆ భాషాపాణికి కరకంకణం.
దశదిశలూ కళ్ళకద్దుకోవలసిన ఈ కథా నీరాజనంలో నరుడే శివుడనుకుంటే, ఆ నరుడి సగభాగమైన పార్వతి నెత్తికెక్కించుకున్న గంగ, చూసే మూడోకన్ను, చేసే ప్రళయ తాండవం, విరిసిన వెన్నెల, కురిసిన చీకటి, వరించిన గరళం, ధరించిన కంకాళం, సరళం, పరుషం, వానా, వరదా అన్నిటి విశ్వరూప సాక్షాత్కారం అమరావతి కథలు. శంకరమంచి చెప్పాడు, కృష్ణమ్మ వింది, కడుపులో దాచుకుంది, తరతరాలకు చెబుతుంది.
-- ఎమ్వీఎల్
Comments
Post a Comment