నీరదము

 

నవంబర్ 24, 2021

నీరదము (nīradamu)

    అర్థము

   (విశేష్యము):  నీరు ఇచ్చునది; మబ్బు; మేఘము; 

   Meaning

   (noun) : cloud
     
   వాడుక / Usage

ఆర్చుకుపోయిన భుమమ్మ తొలకరి చినుకులు తెచ్చే నీరదం కోసం ఎదురు చూసింది.
The parched land awaited the cloud bringing the first showers.

   మెదడుకు మేత / Food for thought

అందాలు అలలైన మందాకిని
మందార మకరంద రసవాహిని
ఆమె చరణాలు అరుణ కిరణాలు
ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక
శృంగార రసరాజ కల్లోలిని
కార్తీక పూర్ణేందు కలహారిని
ఆమె అధరాలు ప్రణయ మధురాలు
ఆమె చలనాలు శిల్ప గమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ

  --  వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి