సెల

 

నవంబర్ 25, 2021

సెల (sela)

    అర్థము

   (విశేష్యము):  ప్రవహించునది; కారునది; యేఱు; బాణము; బాణాపుములుకి; ఏదుపంది ముల్లు

   Meaning

   (noun) : fountainhead; stream; arrow(or it's tip); porcupine's quill
     
   వాడుక / Usage

వెన్నెల సెల యేరులలో కన్యాసమీపంలో ముంగురుల మధుపంలో నన్ను నేను కోల్పోయాను.
I lost myself in the moonlit company of the damsel's curls.

   మెదడుకు మేత / Food for thought

కాళిదాసు, భవభూతి ఒక ప్రక్కన..యమునా చార్యులు. వేదాంత దేశికులు ఒక ప్రక్కన..తిక్కన, పెద్దనలు అటు ప్రక్కన...కబీరు, సూరదాసులు ఇటు ప్రక్కన...షెల్లీ, బైరన్లు మరొక ప్రక్కన నిల్చుంటే..కృష్ణ శాస్త్రి గారు ఎవ్వరి ప్రక్కనైనా నిల్చోగలిగిన 'సత్తా' ఉన్న వారని ''దమ్మున్న' పెద్దల ఉవాచ! 'కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచమంతటికీ బాధ..ప్రపంచం బాధలన్నీ శ్రీ శ్రీ బాధలే' అనిపించారు! '' ఆ తరం కవులు అందరూ ఒక ఎత్తు,కృష్ణ శాస్త్రి గారు ఒక ఎత్తు, వారిలో కృష్ణ శాస్త్రి గారే కొంచెం ఎత్తు''అనిపించారు! ''తెలుగు దేశం నిలువుటద్దం బ్రద్దలైంది..షెల్లీ మళ్ళీ మరణించాడు. వసంతం వాడి పోయింది..'' అని శ్రీ శ్రీ చే పలికించారు! '' మనకున్నది ఒకటే తాజ్ మహల్..ఒకడే కృష్ణ శాస్త్రి'' అనిపించారు!

  -- దేవులపల్లి (నవంబర్ 1, 1897 - 1980) గురించి శ్రీ వనం వెంకటప్రసాదరావు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి