ఉన్మాదము
నవంబర్ 26, 2021
ఉన్మాదము (unmādamu)
అర్థము
(విశేష్యము): వెర్రి; పిచ్చి; తిక్క; చిత్త చంచల్యం
Meaning
(noun) : madness; insanity; mania
వాడుక / Usage
చరిత్రలో యుద్ధాలకి మతోన్మాదం అతిపెద్ద కారణం.
Religious madness is the biggest reason for wars in history.
మెదడుకు మేత / Food for thought
భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.
-- రాజ్యాంగ పీఠిక
Comments
Post a Comment