సాలప్రాంశుడు
నవంబర్ 30, 2021
సాలప్రాంశుడు (saalapraamsudu)
అర్థము
(విశేష్యము): సాల = వృక్షము, ప్రకారము, మద్ది చెట్టు; ప్రాంశు = ఎత్తైన, ఉన్నతమైన; వృక్షమంత ఎత్తైనవాడు, మహోన్నతుడు
Meaning
(noun) : very tall person; colossus
వాడుక / Usage
తెలుగు సాహితీ జగత్తులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అజరామర సాలప్రాంశుడు.
Sirivennela will stride the Telugu literary world forever as a colossus.
మెదడుకు మేత / Food for thought
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే
అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే
మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే
ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషలు పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే
ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే
ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే
నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితమొకటే
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే
ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లనగ్రోవికి గాలొకటే
నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకి విలువొకటే
నీకూ నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వూ నేనూ వారూ వీరూ అంతా కలిసి మనమొకటే
-- సిరివెన్నెల సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment