నితాంతము
నవంబర్ 05, 2021
నితాంతము (nitāntamu)
అర్థము
(విశేషణము): అధికము; అత్యంతము; పెల్లు; అమితము
Meaning
(adv) : extremely; great; immeasurably
వాడుక / Usage
నితాంతమైన ప్రేమతో యుద్ధభూమికేగిన మగనికొరకు ఆమె ఎదురు చూసింది.
She waited with undying love for her lover to return from the battlefield.
మెదడుకు మేత / Food for thought
స్వతంత్ర భారతజననీ, నీ కిదె
నితాంత నవనీరాజనము
అశేష పూజాశిరీషములతో
అగణిత నర నారీజనము
- స్వతంత్ర భారతజననీ
వదలెను చిరదాస్యపుశృంఖలములు
చెదరెను దైన్యతమఃపటమ్ములు
అసేతుహిమనగ మ్మొకపొంగై
అలముకొన్న దానందతరంగము
- స్వతంత్ర భారతజననీ
బలిమికి జేగురు, తాల్మికి తెల్లన
కలిమికి పచ్చన, కర్మచక్రము,
వాడ వాడ నీ హృదిలో మేడల
నేడు త్రివర్ణపతాకములే
- స్వతంత్ర భారతజననీ
పచ్చనితోటల నే యెడ వినినా
స్వేచ్ఛాపికములు నిండుగళమ్ముల
హాయి హాయిగా రెక్కల విద్రిచే
తీయని గీతీహారతులే
- స్వతంత్ర భారతజననీ
త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలే సదాశయములుగ
సకల వసుంధర నేకము చేయగ
అకలంకులమై ప్రతినలు సేతుము
- స్వతంత్ర భారతజననీ
-- బాలాంత్రపు రజనీకాంతరావు (జనవరి 29, 1920 - 2018)
Comments
Post a Comment