సంఘాతము

 

నవంబర్ 09, 2021

సంఘాతము (ṣan-ghātamu)

    అర్థము

   (విశేష్యము):  సమూహం; దండు; తాడనము; గట్టి దెబ్బ

   Meaning

   (noun) : crowd; multitude; hard blow
     
   వాడుక / Usage

  తన ఎడమ చేతి మెరుపువంటి సంఘాతముతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.
  He landed a hard blow with his left hand and his opponent reeled.

   మెదడుకు మేత / Food for thought

పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని
మూగ నేలకు  నీరందివ్వని వాగు పరుగు దేనికని 
తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి
జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని 
ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు 
పద పదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని 
జలవిద్యుత్తుకు కరువేలేదు జన సంపత్తికి కోరవే లేదు 
అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని 
శిశుహృదయానికి కల్లలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు 
లోపలి నలుపు సినారెకి తెలుసు పైపై తొడుగు దేనికని 

-- తెలుగు ఘజల్స్, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి