అయాచితము

 

డిసెంబర్ 13, 2021

అయాచితము (a-yāchitamu)

    అర్థము

   (విశేషణము):  అడగకుండా లభించేది; ఇతరులను యాచించకుండా ఉన్నదానితో బ్రతకడం

   Meaning

   (adj) : getting something that is unasked/unsolicited; living without asking for alms/support
     
   వాడుక / Usage

    అయాచితంగా ఆస్తి రావడం వల్ల అతనికి ధనము యొక్క విలువ తెలియలేదు.
    Having got the property unasked, he did not realize the value of money.

   మెదడుకు మేత / Food for thought

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా...
నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా
కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా..
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను..
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందిలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం

    -- మహర్షి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021) 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి