ఆహార్యము

 

డిసెంబర్ 15, 2021

ఆహార్యము (āhāryamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము):  అభినయము; వేష సామాగ్రి; స్వభావ సిద్ధము కానిది; ఆకర్షింప తగినది; తినదగినది

   Meaning

   (noun/adj) : a dance pose; accessories defining a character in a play; not natural; to be eaten
     
   వాడుక / Usage

    పుష్పాలో కథానాయకుడి ఆహార్యం సహజ సిద్ధంగా ఉంది.
    The protagonist's character in Pushpa has been sculpted realistically. 

   మెదడుకు మేత / Food for thought

కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై
    (కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి. మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!)

    -- శ్మశాన వాటిక, గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి