డిసెంబర్ 21, 2021
సుషమ (sushama)
అర్థము
(విశేష్యము/విశేషణము): శోభాయమానం; మనోహరమైనది; మనోజ్ఞమైన; బాగా అందం కలది
Meaning
(noun/adj) : exquisite beauty/splendour; pleasing
వాడుక / Usage
పండగకి వీధులన్నీ సుషమముగా ముస్తాబయ్యాయి.
The streets were beautifully decorated for the festival.
మెదడుకు మేత / Food for thought
పోతన భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళించినవాడు కరిరాజే కానక్కరలేదు, ఏ మూగజీవికైనా ఇది చెల్లుతుంది. "ఇందుఁ గలడందులేడని సందేహము వలదు" ఇది ఏ ప్రహ్లాద భాషితమో కానక్కరలేదు, ఏ దృఢసంకల్పునికైనా ఇది సరిపోతుంది. "ఊరక రారు మహాత్ములు" దీన్ని ఏ గర్గమునికో ముడివెట్ట నక్కరలేదు. ఇప్పటికీ ఏ మహానుభావుని రాకకైనా ఇది వర్తిస్తుంది.
-- "భక్తి కవితా చతురానన బమ్మెర పోతన" ఉపన్యాసం, డాక్టర్ సి. నారాయణరెడ్డి
Comments
Post a Comment