ముగ్ధ
డిసెంబర్ 22, 2021
ముగ్ధ (mugdha)
అర్థము
(విశేష్యము/విశేషణము): చక్కనిది; క్రొత్తది; ఉదయించుచున్న అందము కల అమ్మాయి; మోహింపు చేయునది; మాయ/కపటం తెలియనిది
Meaning
(noun/adj) : blooming beautiful girl; lovely; simple or guileless
వాడుక / Usage
ముగ్ధ మనోహరమైన ఆమె వదనం అతని గుండెలో చెరగని ముద్ర వేసింది.
Her charming beautiful face left an indelible impression on his heart.
మెదడుకు మేత / Food for thought
ఏమానందము
భూమీతలమున!
శివతాండవమట!
శివలాస్యంబట!
కలలై, పగడపుఁ
బులుఁగులవలె మ
బ్బులు విరిసినయవి
శివతాండవమట!
శివలాస్యంబట!
భూమీతలమున!
శివతాండవమట!
శివలాస్యంబట!
అలలై; బంగరు
కలలై, పగడపుఁ
బులుఁగులవలె మ
బ్బులు విరిసినయవి
శివతాండవమట!
శివలాస్యంబట!
వచ్చిరొయేమొ! వి
యచ్చరకాంతలు
జలదాంగనలై
విలోకించుటకు
శివలాస్యంబట!
యచ్చరకాంతలు
జలదాంగనలై
విలోకించుటకు
శివలాస్యంబట!
-- శివతాండవం, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)
Comments
Post a Comment