నిర్దిష్టము

 

డిసెంబర్ 27, 2021

నిర్దిష్టము (nirdistamu)

    అర్థము

   (విశేషణము):  ఉపదేశింపబడినది; ఆజ్ఞ; చూపబడినది; నిరూపించబడినది

   Meaning

   (adj) : defined; precept; proven/shown (path) rule
     
   వాడుక / Usage

     పార్లమెంట్ని నిర్దిష్ట గడువుకన్నా ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు. 
     Parliament has been prorogued indefinitely a day ahead of defined time.

   మెదడుకు మేత / Food for thought

ప్రభో! నన్ను నేను సమర్పించుకుందామని వచ్చిన క్షణం నన్ను నేను పారేసుకుని వెతుక్కోవడంలో ఒక జీవితకాలం ఆలస్యమైంది. క్షమించు. గడిచిన కాలం గురుతులుగా మిగిల్చిన అనుభవం మచ్చల్ని చెరిపివేయలేమని తెలిసినా, ఆ విషాదమే ఆనందమై, వేదాంతమై, బ్రహ్మమై మిగులుతోంది. సముద్రం మీద నుంచి వచ్చే వేసవిగాడ్పు మామిడితోట చేరి వసంతమైనట్లు, గ్రీష్మకాలపు అనుభవం హేమంతపు తుషార కిరణమవనీ! అదీ నేను కోరుకునేది.
     -- ఆనందోబ్రహ్మ, యండమూరి వీరేంద్రనాథ్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి