డిసెంబర్ 28, 2021
స్తబ్ధత (stabdhata)
అర్థము
(విశేషణము): అణిగి ఉండడం; నిశ్చేష్టం; ముడుచుకోవడం; కదలక పోవడం
Meaning
(adj) : firm; stiff; motionless
వాడుక / Usage
భారత్ చైనా సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకుంది.
Indo-Chinese relations are in a state of paralysis.
మెదడుకు మేత / Food for thought
ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏ గాలక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడిలాంటి నక్షత్రాలకోసం వేటాడుతుండగా వారి దృష్టి మన సూర్యుడిమీద పడింది. తమ అద్భుత సాంకేతిక శక్తితో మన సూర్యుడిని తమ గ్రహలోకానికి చెరువుగా తీసుకుపోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించి, దాని ఆధారంగా భూలోకంలోని శాస్త్రజ్ఞులు సుదూర గ్రహానికి రాయబారం పంపించారు. కాంతి వేగంతో వారి రోదసీ నౌక ఆ దూర గ్రహానికి వెళ్లి కాంతిని మించిన వేగంతో భూలోకానికి గతించిన కాలంలో తిరిగి వస్తుంది.
--చీకట్లో సూర్యుడు(యండమూరి వీరేంద్రనాథ్ ) యొక్క కథాంశం
Comments
Post a Comment