కార్ముకము

 

డిసెంబర్ 29, 2021

కార్ముకము (karmukamu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము):  వెదురు; విల్లు; ఇంద్రధనస్సు; పని సంపూర్ణంగా పూర్తి చేయడం

   Meaning

   (noun/adj) : bamboo; bow; rainbow; finishing a work comprehensively
     
   వాడుక / Usage

     భువినుండి దివికి వారధిగా నిలిచింది ఆ కార్ముకం.
     The mighty rainbow bridged the chasm between earth and heaven.

   మెదడుకు మేత / Food for thought

నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు ఇప్పటికే నీ అందచందాలను అంగాంగ సుందరంగా వర్ణిస్తూ చాలామంది ప్రేమలేఖలు రాసి ఉంటారని. అందమైన ఆడది కనపడగానే కలాలు స్ఖలిస్తాయి. యీ దేశ దౌర్భాగ్యం నాకు బాగా తెలుసు. ప్రేమకి కామానికి ఇనుప తెర ఉందని వాళ్ళు పైకి చెప్తారు. అదంతా ఫోజు. వాళ్ళ దృష్టిలొ ప్రేమంటే కామమే! ఆడదాన్ని చూడగానే వాళ్లకు గుర్తొచ్చేది నల్లులు తిరిగే పందిరి మంచం, పిడచలు గట్టిన పాత పరుపూ మాత్రమే. అందని ద్రాక్షా పళ్ళు పుల్లన. అందుకే మన దేశంలో శృంగార కవిత్వం కొండలా పుట్టి పెరిగింది. చలం చెబితే బూతూ, గీత గోవిందం చెబితే కాదు. మలిన శృంగారం, అమలిన శృంగారం అని సబ్బుల్లోలాగా రకరకాలుగా ఏంలేవు. వీళ్ళ హిపోక్రసి లోంచి తయారైనవే ఇవన్నీ.
     -- చలం ప్రేమ లేఖ రాస్తే ఎలావుంటుంది? శ్రీరమణ పేరడీలు,ముళ్ళపూడి వెంకట రమణ (జూన్ 28, 1931 - 2011)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి