దోబూచులాడు

 

డిసెంబర్ 30, 2021

దోబూచులాడు (doboochulaadu)

    అర్థము

   (క్రియ):  దాగుడుమూతలు; కనపడీ కనపడకుండా ఆడే ఆట; కాలయాపన చేయడం; బూచి = భూతం; 

   Meaning

   (verb) : hide and seek; peekaboo; delaying tactics
     
   వాడుక / Usage

     చందమామ మబ్బుల లోంచి దోబూచులాడింది.
     The moon played hide and seek in the clouds.

   మెదడుకు మేత / Food for thought

నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్న వాఁడు నింద జెందు
ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా
విశ్వదాభిరామ! వినురవేమ!

(తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి అనిపించుకొంటాడు)
    -- వేమన (1652-1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి