క్రోడము

 

జనవరి 17, 2022

క్రోడము (krōḍamu)

    అర్థము

   (విశేష్యము):  ఆలింగనము; ఒక చోటకు చేర్చడం; ఒడి; రొమ్ము; చెట్టు లోపల/మధ్య భాగము; (అడవి) పంది

   Meaning

   (noun) : lap; embrace; breast; chest; hollow of tree trunk; boar      

   వాడుక / Usage

  సమాచారం అంతా క్రోడీకరించి వీర గున్నమ్మ చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు.
  Information was brought together to publish freedom fighter Gunnamma's story.

   మెదడుకు మేత / Food for thought

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్

(లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు; మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు; కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియనే తెలియవు; అలాగే విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారము లైనవి, వ్యర్థము లైనవి. అని భావిస్తాను)

-- ప్రహ్లాద చరిత్రము, ఆంధ్ర మహాభాగవతము, బమ్మెర పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి