ద్యుతి

 

జనవరి 19, 2022

ద్యుతి (dyuti)

    అర్థము

   (విశేష్యము):  ప్రకాశించునది; కాంతి; కిరణము; వెలుగు

   Meaning

   (noun) : light; ray; lustre; splendor; majestic  

   వాడుక / Usage

  చైనా సూర్యునికంటే అయిదు రెట్లు ద్యుతి "కృత్రిమ భాస్కర" ప్రయోగంలో సాధించింది.
  China achieved 5 times more lustre in it's "artificial Sun" experiment.

   మెదడుకు మేత / Food for thought

"రెండు నెలల క్రితం యీ ఇంట్లో అడుగు పెట్టిన మీరిద్దరూ దేవతామూర్తుల్లాగా కనిపించారు. ఒకరి పట్ల ఒకరు మనస్ఫూర్తిగా చేసుకున్న త్యాగాలు మీకా శక్తినిచ్చాయి. కానీ నా మీద అనుమానం రాగానే మీ మనస్సు ఇరుకయిపోయింది. మీరు మనిషిగా అంతకంటే కిందకి మానసికంగా దిగజారిపోయారు. కెప్టెన్ సాబ్! త్యాగం మనిషిని దేముడిని చేస్తుంది. స్వార్ధం అతడిని రాక్షసుడిని చేస్తుంది. ఆ రెండింటి పరాకాష్టని ఒకే సాయంకాలం ఒక చిన్న అనుమానానికి లొంగిపోయి చూపించారు మీరు. చావుకి ఈడిగలబడుతున్న నాలాంటి నిర్భాగ్యుడికి..ఈ చిన్న బ్రతుకులో అమరత్వం సిద్ధింప చేసారు ఆవిడ. ఆమె నాలో, మీలో అందరిలో మమతానురాగాలని జీవితాశను రేపే ఆరాధ్య దేవత."....అప్పటికే అతని చెయ్య డ్రాయరులో ఉన్న రివాల్వర్ మీద పడింది.

-- "లావాలో ఎర్ర గులాబీ" - నాటకంలో పతాక సన్నివేశం, గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి