రాక

 

జనవరి 20, 2022

రాక (rāka)

    అర్థము

   (విశేష్యము):  వచ్చుట, ఆగమనం; నిండు పున్నమి; కొత్తగా రజస్వల అయిన స్త్రీ; ఒక యేరు/నది

   Meaning

   (noun) : coming, arrival; full moon; pubescent girl; a river

   వాడుక / Usage

  విజయావారి చిత్రాలలో మార్కస్ బార్ట్లీ తెరకెక్కించిన రాక జాబిలి అమోఘం. 
  Marcus Bartley's full moon in Vijaya movies is phenomenal.

   మెదడుకు మేత / Food for thought

పది మాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు
కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు
మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ
నీ భుజం మార్చుకోమంటుంది!
తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు
ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు!
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము

-- ఆత్రేయ (మే 7, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి