ఆస్యము
జనవరి 21, 2022
ఆస్యము (āsyamu)
అర్థము
(విశేష్యము): ముఖము; వదనము; నోరు; మాట
Meaning
(noun) : face; mouth; words/speech
వాడుక / Usage
హరి పాంచజన్యమును పూరించినంతనే ఆస్యము నుంచి వచ్చిన ధ్వనితోనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవి.
As Sri Hari blew Panchajanya, just the sound that came from his mouth killed the demons.
మెదడుకు మేత / Food for thought
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
(తెలుగులోనే ఎందుకంటే ఇది తెలుగు దేశం కనుక, తెలుగు రాజువు కనుక, తెలుగు తీయనిది కనుక. రాజులందరూ నిన్ను పొగుడుతుంటే తెలుగులోని మాధుర్యం నువ్వు తెలుసుకున్నావు కదా! దేశంలోని భాషలలో తెలుగు శ్రేష్టము)
-- శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నోట - ఆముక్తమాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు (జనవరి 17, 1471 - 1529)
Comments
Post a Comment