కలికి

 

జనవరి 24, 2022

కలికి (kaliki)

    అర్థము

   (విశేష్యము):  అందమైన స్త్రీ; అతివ; (విశేషణము) మనోజ్ఞము

   Meaning

   (noun) : beautiful woman; damsel; (adj) pleasing

   వాడుక / Usage

  "కలికి చిలకనాయే కలత నిదురలాయే"
  Beautiful parrot am I, sleepless nights have I.

   మెదడుకు మేత / Food for thought

    అయినా వయ్యారం వల్ల మధురవాణికి పేరు వచ్చిందా, మధురవాణి వల్ల వయ్యారం ఫేమస్ అయ్యిందో చెప్పడం కష్టం! అలాగే డబ్బు మదం వల్ల ఎడ్యుకేషన్ చెడిందో ఎడ్యుకేషన్ చెడిందని డబ్బుకు మదం వచ్చిందో, అంతా పదహారణాల కన్ఫ్యూషన్ లాగా ఉంది. అందుకే ఈ రోజుల్లో వీరవెంకటేశం లాంటి విద్యార్థి చుట్టలో హషిష్ దాచి, ఒకసారి పొగ పీల్చి, గోల్డెన్ బీచ్లో శ్రీదేవితో విహరించి, తెలివొచ్చేసరికి వీధి పక్క కుళ్లు కాలవలో పొర్లుతున్నాడు. ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చదువు చెప్తామంటూ వచ్చే గాడిద కొడుకులకు అసలు స్టాండర్డ్ ఉందటోయ్? అందుకే ప్రభుత్వం రోజుకో విద్యావిధానం పూటకో భోజన సదుపాయం పెడుతోంది. నన్నడిగితే విద్యామంత్రులందరూ అక్వైర్డ్ ఇమ్మ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ తోనూ, విద్యాసంస్థలు మాలిగ్నంట్ గ్రోత్ తోనూ, విద్యార్థులు ఫీవేరిష్ బ్రెయిన్ తోనూ సఫరింగ్ బ్యాడ్లీ...

-- మోడరన్ గిరీశం లెక్చర్స్, వెల్చేరు చంద్రశేఖర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి