వెత
జనవరి 25, 2022
వెత (vetha)
అర్థము
(విశేష్యము): వ్యథ; శోకము; బాధ; విచారము; దుఃఖము
Meaning
(noun) : pain; sorrow; distress
వాడుక / Usage
"వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి"
Godavari is our Veda; and is our Queen with a healing touch.
మెదడుకు మేత / Food for thought
ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రకళాకేళిలో భాగమైన సినిమా పాటలో భాష అతి సరళంగా, జనబాహుళ్యం నిత్యం వినియోగించే వ్యావహారికంలా సులువుగా, తేలిగ్గా ఉండాలి అనే నిబంధన తప్పు అనలేం, అనకూడదు కూడా. కాని, వేటూరిగారు తెలిసి తెలిసి సినిమా నియమావళిని అతిక్రమించి, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగర సంగమం’, ‘పార్వతీ పరమేశ్వరులు’ ఇంకా ఇలా ఎన్నో చిత్రాల్లో, అతి ప్రౌఢమైన భాషని వినియోగించడం ద్వారా తెలుగుభాషకి,సంస్కృతికి,ఎలాంటి మేలు జరిగిందో ఒకసారి ఆగి ఆలోచించాలి. మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా.
-- 'హాసం' పత్రికలో వేటూరి గురించి సిరివెన్నెల వ్రాసిన వ్యాసం నుండి
Comments
Post a Comment