నలినము

 

జనవరి 27, 2022

నలినము (nalinamu)

    అర్థము

   (విశేష్యము):  నీరు; తామర/కమలము/నళిని; కొంగ

   Meaning

   (noun) : water; lily/lotus; crane

   వాడుక / Usage

   "నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...  మధురవదన నళిననయన మనవి వినరా రామా"
    Dark as the sky, O' Sita Rama - sweet face and lotus eyed - I beseech you!

   మెదడుకు మేత / Food for thought

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

(అడిగినప్పుడు జీతము ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, నాగలికి వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది)

-- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి