మదన
జనవరి 28, 2022
మదన (madana)
అర్థము
(విశేష్యము): మత్తెక్కించు వాడు; సంతోషము కలగచేసేవాడు; మన్మథుడు; వసంతం; ఉమ్మెత్త చెట్టు; తుమ్మెద మైనము; కల్లు
Meaning
(noun) : Cupid; spring; bee wax; intoxicating person/drink; Dattura tree
వాడుక / Usage
"ఇందువదన కుందరదన మందగమన భామా.. ఇందువలనా ఇందువదనా.. ఇంత మదనా?? ప్రేమా?"
O' damsel who strides gently, with a face like moon and teeth that are blossoms...is it for this, all this intoxicating love?
మెదడుకు మేత / Food for thought
లతికలలో తనూల్లత… విస్మయ మృగనయనాలలో వీక్షణ
నిండు జాబిల్లిలో మనోజ్ఞవదనం… పురి విప్పిన నెమలి పింఛాలలో వేణి
కన్నాను సఖీ! ఓలలాడే నదీ తరంగాలలో నీ… కనుబొమ్మలా కేళి
హతవిధీ! కలబోసిన నీ మదోన్మత్త రూపం భువిలోన లేదే వేరోక్కటి
-- శ్యామాస్వంగం చకితహరిణీం (ఉత్తరమేఘ, 44వ పద్యం - స్వేచ్చానువాదం ), మేఘదూతం, మహాకవి కాళీదాసు (~ 4వ శతాబ్దం)
Comments
Post a Comment