పక్షము

 

జనవరి 07, 2022

పక్షము (pakshamu)

    అర్థము

   (విశేష్యము):  పదిహేను రోజులు; ప్రక్క; రెక్క; చేదోడు; సమూహము; తర్క విషయము

   Meaning

   (noun) : fortnight; side, flank, wing; helper; group, tribe; argument, position
     
   వాడుక / Usage

    

    ప్రజాస్వామ్య మనుగడకు బలమైన ప్రతిపక్షం అవసరం.
    A strong opposition is needed for a vibrant democracy.

   మెదడుకు మేత / Food for thought

చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ...
కల్యాణిగా తాను కడలిలో కలిసింది
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి
సీతమ్మ సిగలోనా మందారం చుట్టి...
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి  శ్లోకమై... శ్రీనాథుడి సీసమై
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
     -- గోదావరి పొంగింది (1985), వేటూరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి