విహ్వలము
ఫిబ్రవరి 10, 2022
విహ్వలము (vihvalamu)
అర్థము
(విశేషణము): ఆందోళనము; కలవరము; తొట్రుపాటు; తబ్బిబ్బు
Meaning
(adj) : shaken; agitated; perturbed
వాడుక / Usage
విహ్వల కంఠంతో దేశం ఈ మత చిచ్చుని ఆపమని ఆక్రోశిస్తోంది.
The country wails in perturbation to douse the flames of religious strife.
మెదడుకు మేత / Food for thought
నేడు మన భారత దేశ పరిస్థితి చాలా భయానకంగా తయారు అవుతుంది. ఒక మతంని అనుసరించె వారు వేరే మతం ని అనుసరించెవారిని
పరస్పరం దారుణ శత్రువులుగా చూస్తున్నారు. వేరు వేరు మతాల ప్రజల మద్య విద్వేషం నానాటికి పెరిగిపొతుంది. ఇలా విద్వషాలు
పెరగటానికి అతి పెద్ద కారాణాలు కూడా లేవు, కేవలం అవతలి వ్య క్తి పరాయి మతం అని ఒక్క కారణం సరిపొతుంది. నేడు భారత దేశ భవిష్య త్తు ఏంటి అని ఆలొచిస్తే చాలా విచారంగా ఉంది. నేడు భారత దేశం మతం అనే చట్రం లొ ఇరుక్కుపొయి ఉంది.
ఇటు వంటి పరిస్థితులలొ జరుగుతున్న మత ఘర్షణల నుండి భారత్ దేశం ఎప్పుడు స్వేచ్చ పొందుతుందొ ఎవ్వరికి అంతుపట్టటం లేదు,
ఇటు వంటి మత ఘర్షణల వలన ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు పల్చబడుతుంది, మూడనమ్మ కాల వరదలొ ప్రజలు ఎలా
కొట్టుకు పొతున్నారో మనం చూస్తున్నం.
-- 'మత ఘర్షణలు వాటి నివారణ' (1927 లో వ్యాసం), భగత్ సింగ్ (సెప్టెంబర్ 28, 1907 - 1931)
Comments
Post a Comment