కుయ్యి

 

ఫిబ్రవరి 11, 2022

కుయ్యి (kuyyi)

    అర్థము

   (విశేష్యము):  మొఱ; ఆర్తధ్వని; అరుపు; రక్షణ

   Meaning

   (noun) : a cry; yell; loud prayer for help; protection

   వాడుక / Usage

   'పిల్ల నువ్వులేని జీవితం ట్రాక్ లేని ట్రైను మీద కుయ్యి మంటూ ఎల్లడం'
   O sweetheart! life without you is like shrieking while going on a train less track.

   మెదడుకు మేత / Food for thought


    అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
    పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
    త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
    హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై

    (అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల మేడ. ఆమేడ పరిసరాల్లో మందార వనం, అందులో అమృత సరస్సు. అక్కడ మంచం పై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడునికి ఏనుగు ‘పాహీ! పాహీ! ( రక్షించు,రక్షించు) అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలుదేరాడు)
    -- గజేంద్ర మోక్షం, ఆంధ్రమహా భాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి