అఖాతము
ఫిబ్రవరి 14, 2022
అఖాతము (a-khātamu)
అర్థము
(విశేష్యము): మనుషులచే త్రవ్వబడని; సహజముగా ఏర్పడిన మడుగు; సముద్రము; అఘాతము
Meaning
(noun) : not dug by humans; natural pond/lake; ocean;
వాడుక / Usage
భారతదేశం లోని చాలా ముఖ్యమైన నదులు బంగాళ అఖాతంలో కలుస్తున్నాయి.
Most of the important rivers of India flow into Bay of Bengal.
మెదడుకు మేత / Food for thought
ఏ పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న విమలతరము
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ పూజలకన్నను పుణ్యతమము
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృతఝరము
ఏ పాదస్మరణ నాగేంద్రశయనుధ్యానమ్ముకన్నను మహానందకరము
అట్టి పితురుల పదసేవ ఆత్మ మరచి ఇహపరమ్ములకెడమై తపించువారి
కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా..
-- పాండురంగ మహత్యం, సముద్రాల రామానుజాచార్య (1923 - 1985)
Comments
Post a Comment