నైసర్గికము
ఫిబ్రవరి 15, 2022
నైసర్గికము (naisargikamu)
అర్థము
(విశేషణము): స్వాభావికము; నైజము; స్వతసిద్ధము
Meaning
(adj) : natural; innate; inborn; constitutional
వాడుక / Usage
బొమ్మలాట మరియు యక్షగానం యొక్క నైసర్గిక స్వరూపాలు పోలికలు కలిగి ఉంటాయి.
Puppetry and yaksha gaana are innately related.
మెదడుకు మేత / Food for thought
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ
(మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు)
-- సుమతీ శతకం, బద్దెన (13వ శతాబ్ధం)
Comments
Post a Comment