ఆవరణము
ఫిబ్రవరి 16, 2022
ఆవరణము (āvaraṇamu)
అర్థము
(విశేష్యము): కప్పునది; మూత; ఆచ్ఛాదనము; వస్త్రము; కంచె; ఇంటి చుట్టూ ప్రదేశం
Meaning
(noun) : covering; garment; fence; compound; space enclosed around house
వాడుక / Usage
స్థిరావరణము భూమి పైన ధృవాల దగ్గర భూ ఉపరితలం నుంచి 7 కి. మీ. ఎత్తువరకు, భూమధ్యరేఖ వద్ద 17 కి. మీ. ఎత్తువరకూ వ్యాపించి ఉంది.
Troposphere extends 7 km at the poles and 17 km at the equator.
మెదడుకు మేత / Food for thought
తలపయి మండుటెండలను దాలచి చల్లని నీడలిచ్చు పాం,
ధిలకు, కఠోరమౌ శిలలతో పడమోదిన పూలు కాయలున్,
ఫలములొసంగు, ప్రాణములు బాసియు కాయము కోసి యిచ్చు నీ
యిల నరజాతికన్ తరువులే గురువుల్ పరమార్ధ బోధనన్!
(తన తలపై ఎండలు కాస్తున్నా బాటసారులకు నీడలిచ్చే, రాళ్లతో కొట్టినా పూలూ పళ్ళు ఇచ్చే, ప్రాణాలు
పోయినా శరీరం మన అవసరానికి సమకూర్చే వృక్షాలే మానవులకు పరమార్థాన్ని చెప్పే గురువులు)
-- జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)
Comments
Post a Comment