అక్షము

 

ఫిబ్రవరి 17, 2022

అక్షము (akshamu)

    అర్థము

   (విశేష్యము):  ఇంద్రియము; వ్యవహారం; పాచిక; ఇరుసు; బండికన్ను; గణించుటకు వీలైన ఒక స్థిరరేఖ; ఉత్తర దక్షిణ ధ్రువములను కలుపు 'ఊహారేఖ'

   Meaning

   (noun) : senses; eye; axle; axis (of earth)

   వాడుక / Usage

 భూమి అక్షం, దాని కక్ష్యాతలానికి 23.44 డిగ్రీల వాలుతో ఉంది.
Earth's axis is tilted at an angle of 23.44 degrees from its orbital plane.

   మెదడుకు మేత / Food for thought


    కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి, ముద్దుబి
    డ్డలును, పడంతి నీపొదిగిట న్నిదురింపగ గన్నెగాడ్పు లూ
    యెలసదనంబు నూచ భయమింత యెఱుంగక కన్నుమూయు నీ
    యలఘుసుఖంబు మాకు గలదా? గిజిగా! యొకఱేని కున్నదా?


    (బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?)


   -- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి